Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : క్లీన్ బ్యాంకింగ్ మా లక్ష్యం.. 2022లో నవభారత్ నిర్మాణం.. విత్తమంత్రి

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:26 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లీన్ బ్యాంకింగ్ తమ లక్ష్యమన్నారు. తమ హయాంలో రూ.3 లక్షల కోట్ల మొండి బాకీలను వసూలు చేసినట్టు చెప్పారు. 2022లో నవభారాతాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు 10 శాతంగా దాటితే, తమ పాలనలో ఇది కేవలం 4.6 శాతంగా ఉందన్నారు. డిసెంబరు నెలలో 2.19 శాతంగా ఉందని గుర్తుచేశారు. సహకార సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు తగిన నిధులు ఇస్తామన్నారు. జీఎస్టీతో సహా ఇతర పన్నుల్లో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. 
 
దేశంలోని బ్యాంకుల నిజస్థితిని దేశం ముందుంచాలని భారతీయ రిజర్వు బ్యాంకును కోరినట్టు చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనివల్ల విద్యా రంగంలో 2 లక్షల సీట్లు పెరుగుతాయని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చామ్నారు. దివాళా చట్టం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేసినట్టు చెప్పారు. గ్రామ సడక్ యోజన ద్వారా రోడ్ నిర్మాణం మూడు రెట్లు పెరిగిందని, ఫలితంగా మారుమూల ప్రాంతాలకు సైతం బసులు వెళ్ళగలుగుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments