Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి హాస్పిటల్‌ను తెరిచిన బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:54 IST)
బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌ నేడు తమ అత్యాధునిక హాస్పిటల్‌ను మాదాపూర్‌లో ప్రారంభించింది. మెట్రో పిల్లర్‌ నెంబర్‌ 1729, బొప్పనాస్‌ అన్నపూర్ణ ఆర్కేడ్‌, కావూరిహిల్స్‌, మాదాపూర్‌, హైదరాబాద్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్‌ను శేరిలింగం పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్‌ఏ అరికెపూడి గాంధీ, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్- డాక్టర్‌ ఏ వీ గురవారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాదాపూర్‌ కార్పోరేటర్‌ వి జగదీశ్వర్‌ గౌడ్‌; బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్స్‌ కో-ఫౌండర్లు డాక్టర్‌ సాహిత్య దేవు మరియు డాక్టర్‌ దివ్య రెడ్డి పాల్గొన్నారు.
 
అత్యున్నత శ్రేణి సదుపాయాలు, సుశిక్షితులైన సిబ్బంది కలిగిన ఈ నూతన కేంద్రంలో అన్ని రకాల కంటి సమస్యలకూ అత్యంత వేగంగా చికిత్సను అందించనున్నారు. బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌లో లేసిక్‌ సర్జరీని కేవలం 1.5 సెకన్లలోనే చేస్తే , క్యాటరాక్ట్‌ సర్జరీని ఐదు నిమిషాలలో చేయగలరు. ఇవే కాదు, 2మిల్లీమీటర్ల కోతతో క్యాటరార్ట్‌ సర్జరీ చేయడంతో పాటుగా చిన్నారులు, పెద్ద వయసు వారికి ప్రత్యేకమైన చికిత్సనూ అందించనున్నారు.
 
ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం హాస్పిటల్‌ కో-ఫౌండర్లలో ఒకరైన సాహిత్య దేవు మాట్లాడుతూ, ‘‘పూర్తి సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్‌ ఏర్పాటుచేశాం. నగరంలో అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలువాలనేది మా లక్ష్యం. పిడయాట్రిక్‌ ఐ కేర్‌, కార్నియా మార్పిడి, గ్లౌకోమా వంటి సేవలతో పాటుగా అవసరమైన అన్ని కంటి చికిత్సలనూ అందించనున్నాం. 6,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ప్రపంచ శ్రేణి సాంకేతికతను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం’’ అని అన్నారు.
 
బెస్ట్‌ విజన్‌ ఐ హాస్పిటల్స్‌ కో-ఫౌండర్‌ డాక్టర్‌ దివ్య మాట్లాడుతూ, ‘‘నగరంలో కంటి సంరక్షణను పునర్నిర్వచించడం మా లక్ష్యం. ఈ నూతన క్లీనిక్‌ను ప్రారంభించడమనేది నగరంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన కంటి సంరక్షణను చేరువచేయాలనే మా లక్ష్యంకు కొనసాగింపు’’ అని అన్నారు.
 
మాదాపూర్‌ వద్దనున్న ఈ సెంటర్‌ పెరుగుతున్న ఈ ప్రాంత వాసుల అవసరాలను ప్రపంచశ్రేణి కంటి సంరక్షణ సదుపాయాలతో తీర్చనుంది. సాధారణ కంటి సమస్యలైనటువంటి కాటరాక్ట్‌, రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌తో పాటుగా ఈ నూతన సూపర్‌ స్పెషాలిటీ ఐ కేర్‌ సెంటర్‌లో గ్లౌకోమా, డయాబెటిక్‌ రెటినోపతి, మాక్యులర్‌ డీజనరేషన్‌, కార్నియా కండిషన్స్‌, కాస్మెటిక్‌ ఆక్యులోప్లాస్టీ, యువీఈఏ, పెడియాట్రిక్‌ కేర్‌ సేవలను కూడా అందిస్తుంది. అత్యాధునిక ఆపరేషన్‌ సదుపాయాలు కలిగిన ఈ సెంటర్‌ రోగులకు అత్యుత్తమ సర్జికల్‌ సేవలనుసైతం అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments