రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే అమ్మాయితో డాన్స్ చేసింది వైరల్ అయింది. కానీ ఒకరితోకాదు ముగ్గురితో డాన్స్ చేశారు. కానీ ఒక అమ్మాయితే హైలైట్ అయింది. ఆ అమ్మాయి పేరు ఇనయా సుల్తానా. ఆ ఇద్దరినీ ఎవరూ సరిగ్గా చూడలేదని వర్మ తెలియజేస్తున్నారు. అమ్మాయి కాళ్ళమీద పడ్డానని చాలామంది అన్నారు. అమ్మాయిలోని ప్రతీది ఎంజాయ్ చేస్తాను అంటూ బోధిస్తున్నాడు. ఒకవైపు తాలిబన్ ఇష్యూ గురించి మాట్లాడుతూ, మరోవైపు మహిళలతో ఎంజాయ్ చేస్తూ వీడియోలు పెట్టడంపై ఆయన ఓ ట్విట్టర్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.
నాకు తాలిబన్లపై వున్న ఇంట్రెస్ట్ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసేవారిపై వుండదు. మదర్ థెరిస్సా కంటే పూలన్‌దేవి గురించే ఆలోచిస్తా. త్వరలో పూలన్‌దేవి మళ్లీ పుడితే అనే సినిమా తీస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. అయితే అమ్మాయిలతో చిందులువేసే వీడియోలు పెట్టడంవల్ల సామాజిక బాధ్యత మర్చిపోయారా! అని ప్రశ్నిస్తే దానికి తన శైలిలో బదులిచ్చాడు. నామీద కోపంగా వుందా. అయితే తాలిబన్ నుంచి గన్ తీసుకురండి అంటూ వెటకారంగా మాట్లాడాడు.
సమాజంలో మతం, మొరాలిటీ, ఎథిక్స్, లీగల్ అనేవి వుంటాయి. వాటిని పాటించాలి. నేను మూడింటిని పాటించను. లీగల్‌నే పాటిస్తాను. ఈ వీడియో కూడా అటువంటిదే. మతం అంటే పాపం, పుణ్యం అనేది చెబుతారు. మొరాలిటీ అంటే. పక్కింటోడి భార్యను చూడకూడదు అనేది. ఎథిక్స్ అంటే మన పక్కవారు ఏమనుకుంటున్నారో మన గురించి అనేది ఆలోచిస్తారు.
లీగల్ అంటే, సమాజంలో వున్నాం కాబట్టి నిబంధనలు పాటించాలి. పాటించకపోతే శిక్ష వేస్తారు. నేను అలాంటి లీగల్‌ను పాటించాను. అంటూ తనదైన రూటులో వివరించాడు. నా ట్విట్టర్ నా ఇష్టం. అంటూ వెల్లడించాడు. ఇకముందు కూడా ఇలాంటివి వస్తూనే వుంటాయి. నేను చచ్చేంతవరకు ఇలా చేస్తూనే వుంటానంటూ ఘాటుగా వర్మ స్పందించారు. నన్ను ఇష్టపడి ఫాలో అయినవారు వుంటారు. వారికోసం పెట్టాను. ఇష్టం లేనివారు ట్విట్టర్‌లో అన్‌ఫాలోచేసుకోండని సలహా ఇచ్చాడు.