Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే 12 నెలల్లో గృహాల ధరలు పెరుగుతాయని హైదరాబాద్ గృహ యజమానులు భావిస్తున్నారు: నైట్ ఫ్రాంక్

వచ్చే 12 నెలల్లో గృహాల ధరలు పెరుగుతాయని హైదరాబాద్ గృహ యజమానులు భావిస్తున్నారు: నైట్ ఫ్రాంక్
, బుధవారం, 25 ఆగస్టు 2021 (20:17 IST)
నైట్ ఫ్రాంక్ ఇండియా, ఒక ప్రీమియర్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, వారి తాజా సర్వే "ఇండియా బయ్యర్ సర్వే 2021- కోవిడ్ 19 కాలంలో నివసించడం"లో ఇలా పేర్కొన్నారు, హైదరాబాద్ నుండి 80% మంది ప్రతివాదులు రాబోయే 12 నెలల్లో తమ ప్రాథమిక గృహం విలువ 10% కంటే ఎక్కువగా పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతివాదులలో సగానికి పైగా నగరంలోని కొత్త ఇంటికి మారడాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతివాదులు దాదాపు 55% మంది రాబోయే 12 నెలల్లో రెండవ ఇంటిని కొనుగోలు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు.
 
ఇంటి ధర పథానికి సంబంధించి; నగర ప్రతివాదులలో 57% మంది తమ ప్రస్తుత గృహం ధర వచ్చే 12 నెలల్లో 10% - 19% వరకు పెరుగుతుందని అంచనా వేశారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సగానికి పైగా వారి ప్రాథమిక నివాసం విలువ క్షీణతను నివేదించినందున ఇది ఆశావాద సెంటిమెంట్ విలువ వైపు చాలా (క్వాంటం) మంచి మార్పు.
 
భవిష్యత్తులో కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్య కారణాలపై, నగరంలోని ప్రతివాదులు 43% కుటుంబ పరిమాణంలో పెరుగుదల వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. కుటుంబం యొక్క ప్రాథమిక నివాసాన్ని అప్‌గ్రేడ్ చేయడం (ప్రతివాదులలో 22%) వారి భవిష్యత్తు గృహ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే రెండవ అతి ముఖ్యమైన కారణం. ప్రతివాదులు హాలిడే హోమ్ (12%) కి సంబంధించిన కొనుగోలు నిర్ణయాలు కూడా భవిష్యత్తులో గృహ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు.
 
భవిష్యత్తులో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రాధాన్యత ప్రాంత లక్షణాల అంశంపై, 97% ప్రతివాదులు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రధాన లక్షణంగా అధిక ఆకుపచ్చ ప్రాంతాలను నివేదించారు. మంచి ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యత (91% ప్రతివాదులు) రెండవ అతి ముఖ్యమైన లక్షణంగా మరియు కార్యాలయానికి సమీపంలో (78% ప్రతివాదులు) మూడవ అతి ముఖ్యమైన లక్షణంగా భావించబడింది.
 
స్థల మార్పు లేదా కొత్త ఇంటికి వెళ్లడం అనే అంశంపై, హైదరాబాద్ నుండి ప్రతివాదులు 54% మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి తమ నివాసాన్ని మార్చారని నివేదించారు. పునరావాసం పొందిన 58% మంది తమ నిర్ణయానికి ప్రాధమిక ప్రేరణగా మరింత బహిరంగ స్థలం / బహిరంగ ప్రదేశాల అవసరాన్ని పేర్కొన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. రాబోయే 12 నెలల్లో మహమ్మారి ఏవైనా పునరావాస ప్రణాళికలను ప్రభావితం చేసిందా అని అడిగినప్పుడు, 76% మంది ప్రతివాదులు మహమ్మారి వారి స్థల మార్పు ప్రణాళికలలో ఎలాంటి మార్పు లేదని అభిప్రాయపడ్డారు. అలాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే, నగరం లోపలికి మారడానికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
 
మహమ్మారి ప్రభావం రెండవ ఇంటి కోసం వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసిందా అని అడిగినప్పుడు, 55% మంది సమీప భవిష్యత్తులో రెండవ ఇంటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. రజనీ సిన్హా, చీఫ్ ఎకనామిస్ట్ మరియు నేషనల్ డైరెక్టర్ - రీసెర్చ్, నైట్ ఫ్రాంక్ ఇండియా ఇలా అన్నారు, "హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ కొనుగోలుదారుల మనోభావాలలో వివిధ కీలక పారామితులపై చాలా ఆశాజనకంగా ఉంది.
 
"ఎక్కువ గ్రీన్ ఓపెన్ స్పేస్‌లు, మంచి హెల్త్‌కేర్ యాక్సెస్ మరియు కార్యాలయ ప్రాంతాలకు దగ్గరగా ఉండటం అనేవి ఇంటి కొనుగోలుదారుడి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ముఖ్య లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. ఐటి సంస్థలు తమ ప్రధాన వ్యాపారంలో వృద్ధిని కొనసాగిస్తుండగా, హైదరాబాద్ తుది వినియోగదారులకు మరియు పెట్టుబడిదారులకు ఒక మంచి నివాస గమ్యస్థానంగా కొనసాగుతోంది. ఆసక్తికరంగా, గృహ కొనుగోలుదారుల వైఖరులు ఖర్చు ప్రవృత్తి విషయంలో సానుకూలంగా ఉన్నాయి."
 
వ్యయ ప్రవృత్తిలో నగర స్థాయి మార్పులకు సంబంధించి  54% ప్రతివాదులు 9% వరకు పెరుగుదలను సూచించారని వెల్లడించింది. హైదరాబాదులో ప్రతివాదుల వైఖరి కొత్త గృహాలను కొనుగోలు చేయడానికి వ్యయ ప్రవృత్తికి సంబంధించి చాలా ఆశాజనకంగా ఉన్నాయి.
 
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం మరియు రెసిడెన్షియల్ సెగ్మెంట్ వినియోగదారులపై తదుపరి లాక్డౌన్ అంచనాను లక్ష్యంగా చేసుకుని ఇండియా బయ్యర్ సర్వే-2021 కోసం సర్వే నిర్వహించబడింది. సర్వేలో పార్ట్ I హై-ఎండ్ ఆదాయ విభాగం నుండి ప్రతివాదులను కలిగి ఉంటుంది, అలాగే పార్ట్ II ప్రధానంగా మిడ్-ఎండ్ ఆదాయ విభాగాల నుండి ప్రతివాదులను కలిగి ఉంటుంది. హైదరాబాద్ మార్కెట్ కోసం ఊహాగానాలు ప్రధానంగా మిడ్-ఎండ్ ఆదాయ విభాగం ప్రతివాదుల నుండి సేకరించబడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక కొత్త సాఫ్ట్ వేర్ తోనే రిజిస్ట్రేషన్లు: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్