ఈ యేడాది ఆఖరు నెల డిసెంబరులో బ్యాంకులకు రెండు అంకెల్లో సెలవులు రానున్నాయి. నిజానికి ఎలాంటి పండగలు, పబ్బాలు లేకపోయినప్పటికీ బ్యాంకులకు మాత్రం ఏకంగా 17 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. భారత రిజర్వు బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం డిసెంబరు నెలలో 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమడత పని ఉంటే సకాలంలో పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సలహా ఇస్తున్నారు. ఈ సెలవులు ఏకరీతిన లేనప్పటికీ అవి వివిధ రకాలుగా నిర్ణయించారు. డిసెంబరు నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలుపుకుని మొత్తం 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడం విశేషం. అయితే, ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.
డిసెంబరు 2024లో వచ్చే బ్యాంకు సెలవులను పరిశీలిస్తే,
డిసెంబర్ 1న ఆదివారం - (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు