Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

Advertiesment
Mithunam

రామన్

, బుధవారం, 27 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. చీటికిమాటికి చికాకుపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆలయాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రముఖుల సలహా పాటిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. దూర ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. దైవకార్యాల్లో పాల్గొంటారు. కొత్తపరిచయాలేర్పడతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించండి. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలతో సతమతమవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకలు, వినోదాల్లో దూకుడు తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు