మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఊహలు ఫలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అదృష్టయోగమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలు చికాకుపరుస్తాయి. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతిలోపం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి.. అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. సంకల్పబలమే మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సేవాసంస్థలకు సాయం అందిస్తారు. పనుల్లో జాప్యం, ఒత్తిడి అధికం. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకలు, విందులకు హాజరవుతారు.