మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తుయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. పరిచయస్తుల వ్యాఖ్యలకు దీటుగా స్పందిస్తారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. సన్మాన సభల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పుణ్యక్షేత్రాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆప్తులతో సంభాషణ ఊరటనిస్తుంది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్మూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పత్రాలు అందుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. పదవులు దక్కకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులను విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. దైవకార్యంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు పురమాయించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడకల్లో అత్యుత్సాహం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోండి. ఖర్చులు విపరీతం. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వేడుకకు హాజరుకాలేరు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు.