Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాప్యంలో పెన్షన్ పొందాలంటే.. రోజుకు రూ.10 చాలు..

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:27 IST)
వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి ఇది మంచి పొదుపు పథకం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారెవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 
 
బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు. మీరు ఈ పథకంలో చేరిన నాటి నుంచి మీ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి. మీకు 60 ఏళ్లు పూర్తైన నాటి నుంచి నెలకు పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఎంత తక్కువ వయస్సులో చేరితే అంత తక్కువ పొదుపు చేయొచ్చు. మీ వయస్సు పెరిగినకొద్దీ పొదుపు చేయాల్సిన మొత్తం పెరుగుతుంది.
 
ఉదాహరణకు మీ వయస్సు 22 అయితే మీరు నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలంటే నెలకు ఎంత పొదుపు చేయాలో తెలుసా? కేవలం రూ.292 మాత్రమే. అంటే రోజుకు రూ.10 పొదుపు చేస్తే చాలు. నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. అదే మీ వయస్సు 18 ఏళ్లు అయితే రోజుకు రూ.7 చొప్పున నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరి రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే నెలకు రూ.1,454 జమ చేయాల్సి వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది..

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments