ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులక వేతనాల చెల్లింపులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ఆమోదముద్రవేశారు. దీంతో ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు మార్గం సుగమయమైంది.
ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలిలో ఆమోదముద్ర పడకపోవడంతో... ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడని సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం క్రితం ఆమోదముద్ర వేశారు.
దీంతో, ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపుకు, ఇతర బిల్లుల చెల్లింపులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. శాసనమండలి సమావేశాలు ముగిసిన తర్వాత... 14 రోజుల గడువు ముగియడంతో బిల్లును శుక్రవారం గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. ఆయన ఆమోదం తెలపడంతో జీతాల సమస్య తీరిపోయింది.