దేశీయ మార్కెట్ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 613 పాయింట్ల లాభంతో 34901 వద్ద, నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 10327 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌ను నడిపిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు నేటి ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి.
బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 3.50శాతానికి పైగా 21,785.85 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది.
లాక్‌డౌన్ సడలింపులో భాగంగా దాదాపు 75 రోజుల తర్వాత నేడు దేశవ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థలాలు పునః ప్రారంభం కానుండటం ఈక్విటీ మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇకపోతే.. బజాజ్ ఫైనాన్స్, టాటామోటర్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. విప్రో, సన్‌ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి.