Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నూతన ఈవీ డీలర్‌షిప్‌ ప్రారంభించినట్లు వెల్లడించిన ఆంపియర్‌

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:08 IST)
గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధమైన విద్యుత్‌ మొబిలిటీ అనుబంధ సంస్థ గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీకు చెందిన విద్యుత్‌ ద్విచక్ర స్కూటర్‌ బ్రాండ్‌ ఆంపియర్‌  తమ నూతన ఈవీ డీలర్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో లక్ష్మీ మోటర్స్‌ కింద ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ డీలర్‌షిప్‌తో  కర్నూలులో బ్రాండ్‌ యొక్క కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయి.

 
స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రాయలసీమ రీజనల్‌ మేనేజర్‌ శ్రీ సూర్యప్రకాష్‌ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ స్టోర్‌లో ఆంపియర్‌ ఉత్పత్తులతో పాటుగా అదనపు ఈవీ వనరులు సైతం అందించనున్నారు. ఈ స్టోర్‌ 40/29/డీ, గ్రౌండ్‌ ఫ్లోర్‌, మేడమ్‌ కాంపౌండ్‌, వార్డ్‌ నెంబర్‌ 40, పార్క్‌ రోడ్‌, యు కాన్‌ ప్లాజా ఎదురుగా, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌- 518001 వద్ద ఉంది. ఈ విస్తరణతో, ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌, ఈవీ స్వీకరణను మరింత వేగవంతంగా మార్చడంతో పాటుగా ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చేస్తామని, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ మరింత మెరుగుపరుస్తామనే వాగ్ధానం పునరుద్ఘాటిస్తుంది.

 
ఈ ప్రారంభం గురించి గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీఈవో-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ సంజయ్‌ బెహల్‌ మాట్లాడుతూ, ‘‘ కర్నూలులో మా నూతన డీలర్‌షిప్‌ స్టోర్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. గ్రీవ్స్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్‌ ఆంధ్రప్రదేశ్‌. ఈ నూతన డీలర్‌షిప్‌ స్టోర్‌ మొత్తం కర్నూలు జిల్లాకు ద్వితీయ శ్రేణి నెట్‌వర్క్‌గా పనిచేయడంతో పాటుగా ఇతర చిన్న పట్టణాలకు సైతం అత్యుత్తమ కనెక్టివిటీ అందించనుంది. ఈ నూతనడీలర్‌షిప్‌, నగరంలో పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ అవసరాలను తీర్చడంతో పాటుగా ఈవీ ప్రియులక అత్యుత్తమ యాజమాన్య అనుభవాలను సైతం అందించనుంది’’ అని అన్నారు.

 
వినియోగదారులు ఇప్పుడు తమ అభిరుచులకు తగినట్లుగ  విస్తృతశ్రేణిలో ఆంపియర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. అత్యాధునిక మాగ్నస్‌ ఈఎక్స్‌ ను సైతం నూతన ఈవీ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే విభిన్నమైన ఇతర ఈవీ యాక్ససరీలను సైతం కొనుగోలు చేయవచ్చు. సస్టెయినబల్‌ మరియు అందుబాటు ధరలలో మొబిలిటీ పరిష్కారాలను అందించడాన్ని ఆంపియర్‌ నమ్ముతుంటుంది. ఇది అపూర్వమైన డ్రైవ్‌ అనుభవాలను అందించడంతో పాటుగా వినియోగపరంగా అత్యధిక పనితీరునూ అందిస్తుంది. దాదాపు 1.5 లక్షలకు పైగా సంతోషకరమైన వినియోగదారులు మరియు 400కు పైగా ఆధీకృత అమ్మకాలు మరియు సేవల ఔట్‌లెట్లు దేశవ్యాప్తంగా ఉండటం వల్ల, ఖచ్చితమైన లైఫ్‌ సైకిల్‌ మద్దతుతో వినియోగదారులు కొనుగోలు చేయడంతో పాటుగా మొత్తం యాజమాన్య అనుభవాల ద్వారా ప్రయోజనం పొందగలరు.

 
దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్‌ ద్విచక్ర స్కూటర్‌ బ్రాండ్‌లలో ఒకటి ఆంపియర్‌. తమిళనాడులోని రాణిపేట వద్ద ఉన్న గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నూతన ఈవీ మెగా ఫెసిలిటీతో భారతదేశంలో ఈవీ విప్లవం తీసుకువచ్చే, మరీ ముఖ్యంగా విద్యుత్‌  ద్విచక్రవాహన విభాగంలో మహోన్నత స్ధానంలో ఆంపియర్‌ ఉంది. మహమ్మారి అనంతర ప్రపంచంలో భారతదేశం ఆధునిక యుగంలో ప్రవేశిస్తోన్న వేళ, సురక్షితమైన, ఎక్కువ ఆదా చేయగలిగిన పరిష్కారాలను అందించడానికి ఆంపియర్‌ కృషి చేస్తోంది మరియు వ్యక్తిగత ఫ్యామిలీ విద్యుత్‌ స్కూటర్‌ను సొంతం చేసుకోవడంలో ఆనందాన్ని మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments