Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ బాస్ బెజోస్‌కు సెగ-300 సిటీల్లో నిరసనలకు సర్వం సిద్ధం

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (14:14 IST)
అమేజాన్‌ ‌ఫౌండర్‌‌‌‌ జెఫ్‌‌బెజోస్‌‌కి వ్యతిరేకంగా దేశమంతటా 300 సిటీలలో నిరసనలు చేపేట్టేందుకు కాన్ఫెడెరేషన్‌‌ ఆఫ్‌‌ఆల్‌‌ఇండియా ట్రేడర్స్‌‌(సెయిట్‌‌) సిద్ధమవుతోంది. ఢిల్లీలో జరగనున్న కంపెనీ ఈవెంట్‌‌లో  పాల్గోనేందుకు బెజోస్‌‌వచ్చే వారం ఇండియాకు వస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు.
 
దేశంలోని ఈ-కామర్స్‌‌కు సంబంధించి ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కాగా బెజోస్‌‌ఏ తేదిన ఇండియాకు వస్తున్నారు?  ఎక్కడ స్టే చేస్తున్నారు? వంటి విషయాలు ఇంకా బయటకు రాలేదు. వీటిపై అమేజాన్‌‌ ఇండియా స్పందించలేదు. చిన్న చిన్న స్టోర్లను నిర్వహిస్తున్న ఏడు కోట్ల మంది రిటైలర్లను సెయిట్‌‌ రిప్రెజెంట్‌‌చేస్తోంది. బెజోస్‌‌కు వ్యతిరేకంగా దేశం మొత్తం మీద 300 సిటీలలో నిరసనలు చేస్తామని సెయిట్‌‌ పేర్కొంది. 
 
ఆఫర్లను అధికంగా ఇస్తున్నారని, ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను అతిక్రమిస్తున్నారని అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌పై వీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఈ రెండు కంపెనీలు ఖండించాయి. చిన్న వ్యాపారులకు, మహిళ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌లకు, కళాకారులకు బిజినెస్‌‌ అవకాశాలను అందిస్తున్నామని అమెజాన్‌‌ పేర్కొంది. 
 
జెఫ్ బెజోస్‌‌కు వ్యతిరేకంగా ఢిల్లీ, ముంబై, కోల్‌‌కతా, చిన్న టౌన్లు, సిటీలలో శాంతియుతంగా ర్యాలీలు చేస్తామని సెయిట్​ సెక్రటరీ జనరల్‌‌ ప్రవీణ్‌‌ ఖండేల్వాల్​  అన్నారు. ఈ నిరసనల కోసం మొత్తంగా లక్షమంది ట్రేడర్లను మొబిలైజ్‌‌ చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments