Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెజాన్‌ లో ఆప్కో వస్త్రాల అమ్మకాలు

Advertiesment
అమెజాన్‌ లో ఆప్కో వస్త్రాల అమ్మకాలు
, బుధవారం, 4 డిశెంబరు 2019 (05:42 IST)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆప్కో వస్త్రాల వ్యాపార రంగాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార సంస్ధ అమెజాన్‌తో వ్యాపార ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు అమెజాన్ సంస్ధ ఆన్ లైన్ విధానంలో ఆప్కో వస్త్ర ఉత్పత్తులను మీడియా సమక్షంలో ప్రారంభించారు. మంత్రి తొలి చేనేత వస్త్రాన్ని ఆన్‌లైన్ విధానం ద్వారా కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  ఇప్పటి వరకు ఆప్కో వస్త్ర వ్యాపారాలు షోరూమ్‌ల విధానం ద్వారా విక్రయాలు జరిగేవన్నారు. చేనేతల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ వస్త్రాలకు మార్కెట్ రంగంలో మంచి డిమాండ్ ఉన్నప్పటీకీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ వస్త్రాలకు కొనుగోళ్ల శాతం తగ్గుతూ వస్తుందన్నారు.

చేనేతలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో చేనేత పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్త్రాలకు బహిరంగ మార్కెట్ లో డిమాండ్ పెంచేందుకు నూతన ఆన్ లైన్ విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు.

అమెజాన్ వంటి ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్ధతో ఆప్కో వస్తాలను విక్రయించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆప్కో వస్త్ర సంస్ధ కొన్ని ప్రాంతాల్లోనే తన వ్యాపార విక్రయ కేంద్రాలను నెలకొల్పిందన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మిగతా వస్త్ర వ్యాపార రంగాలను అధిగమించి తమ వస్త్రాలను అమ్ముకునేందుకు ఈ ఆన్ లైన్ తరహ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఆన్ లైన్ విధానం ద్వారా అత్యంత నాణ్యమైన ఆప్కో చేనేత వస్త్రాల వ్యాపారం అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చన్నారు. దీనితో పాటు ఆన్ లైన్ విక్రయ విధినాలను అధిక మొత్తంలో పెంచుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. నాణ్యమైన ఆప్కో చేనేత వస్త్రములు అందరికి అందుబాటులోకి తీసుకు రావడంతో ఆప్కో బ్రాండ్ ఇమేజ్ ను పెంచవచ్చన్నారు.

అలాగే చేనేత కార్మికులకు ఎప్పటికప్పుడు చెల్లింపు చెల్లించవచ్చన్నారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు అందించే అవకాశం ఉందన్నారు. ఆప్కో ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకునే వీలుందన్నారు. ఇందుకోసం తొలిసారిగా ఆప్కో వస్త్రాలను విక్రయించేందుకు అమేజాన్ సహకరంతో ఇ-కామర్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

అమెజాన్ లో లభించే ఇతర ఉత్పత్తులను ఇ-కామర్స్ ద్వారా విక్రయిస్తే 15% కమీషన్ ఆ సంస్థ వసూలు చేస్తూండగా, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రకారం 8% చెల్లించడానికి అవకాశం కలిగిందన్నారు. ఉచిత క్యాట్ లాగింగ్, అకౌంటింగ్ నిర్వహణ సులభతరం చేశామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అమెజాన్ తో కేటాయించిన కరిగర్ స్టోర్ ద్వారా ఆప్కో వస్త్ర ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉంచామన్నారు.

ఇప్పటీకే అమోజాన్ కు 60 లక్షల విలువ చేసే ఆప్కో వస్త్రాలను అందించడం జరిగిందన్నారు. ఇందులో 104 రకాల చేనేత వస్త్రాలు తొలి విడతలో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆప్కో వస్తాలలో ప్రధానంగా రాజమండ్రి కాటన్ చీరలు, మాధవరం సీకో, కాటన్ వెంకటగిరి, మంగళగిరి, బందరు కాటన్ చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు.

గుంటూరు జిల్లా ఇసుకపల్లి టవల్స్, నాప్ కిన్స్ ప్రకాశం ఈత ముక్కల లుంగీలు, శ్రీకాకుళం పొందూరు దోవతులు, చీరాల చున్నీలు, దుప్పట్లు, డ్రస్స్ మెటీరియల్స్, సత్తన పల్లి దుప్పట్లు తదితర వస్త్రాలను ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్ధ అమెజాన్ కు అందజేయడం జరిగిందన్నారు. అమెజాన్ వంటి అతి పెద్ద ఆన్ లైన్ ఫ్లాట్ ఫారం ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలు జరపడం ఇదే ప్రధమం అని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆప్కో అధికారుల సమీక్షా సమావేశాలలో అనేక సార్లు చేనేత ఉత్పత్తుల గిరాకీని పెంచుటకు విభిన్న తరహా విధానాలను అవలంభించాలని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఆప్కో మేనేజింగ్ డైరెక్టరు హిమాన్షు శుక్లా (ఐఎఎస్) మాట్లాడుతూ పలు వ్యాపార ఏజెన్సీలను పరిశీలించి అమెజాన్ సంస్థ ఆప్కో చేనేత వస్త్రాలకు అతి తక్కువ సర్వీస్ ఛార్జీలతో విక్రయించుకొనేలా ఒప్పందం చేసుకుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చేనేత సంచాలకులు, అమెజాన్ ప్రతినిధులు ఆదిత్య, మేరూన్, ఆక్టస్ సలహదారు ఎమ్.డి మానిష్ గోకులేష్, చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు, ఆప్కో జనరల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై అమెజాన్‌లో ఆప్కో చేనేతలు: మంత్రి మేకపాటి గౌతం రెడ్డి