Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవాంఛిత ముఖ రోమాలు... యువతుల అందానికి బంధాలు... ఏం చేయాలంటే?

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (15:08 IST)
చాలామంది యువతుల ముఖంపై అవాంఛిత రోమాలు  ఇబ్బంది పెడుతుంటాయి. వీటి వల్ల యువతుల ముఖారవిందం దెబ్బతింటుంది. ఈ తరహా రోమాలు ఉన్న వారు నలుగురిలోకి వచ్చేందుకు సిగ్గుపడుతారు. అయితే, ఈ రోమాలు.. కొంతమందికి పల్చగా కనపడితే, మరికొంతమందికి కనిపించకుండా ఉంటాయి. మరికొందరికి దట్టమైన కేశ సంపద ఉంటుంది. 
 
ఇలా ఎక్కువగా ఉన్నట్లయితే వారి శరీరం మగవారి శరీరంలా ఉంటుంది. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నా కూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. దీంతోపాటు ఇలాంటివారు మానసికంగా కుంగిపోతుంటారు. దీనికి పరిష్కారం వెంట్రుకలను తొలగించడమే. ఈ వెంట్రుకలను ఎలక్ట్రాలసిస్, త్రెడ్డింగ్, వ్యాక్సింగ్ పద్ధతుల ద్వారా వెంట్రుకలను తొలగించుకోవచ్చు.
 
ఎలక్ట్రాలసిస్ : ఎలక్ట్రాలసిస్ అనేది పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో బ్యుటీషియన్లు చేస్తుంటారు. ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే డబ్బుతో కూడుకున్న పని. ఇంతగా కష్టపడి చేసుకున్నా మళ్ళీ వెంట్రులు వచ్చేస్తాయి. కనుక ఇది తాత్కాలికమైన ప్రక్రియే. 
 
త్రెడ్డింగ్ : త్రెడ్డింగ్ అనేది చాలా తేలికైన పని. దీనిని ఎవరికివారే స్వయంగా చేసుకోవచ్చు. దీంతో కనుబొమలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. త్రెడ్డింగ్ చేయించుకుంటే వెంట్రుకలు వేగంగా పెరుగుతాయనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే అటువంటిదేం జరగదని బ్యుటీషియన్లు చెపుతున్నారు. 
 
వ్యాక్సింగ్ : పైన పేర్కొన్న అన్ని విధానాల్లోకెల్లా ఈ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఈ పద్ధతితో వెంట్రుకలను తొలగించేటప్పుడు దీని వలన శరీరానికి కొంచెం నొప్పి వున్నా ఎలాంటి నష్టం కలిగించదు. నిత్యం ఈ పద్ధతిని పాటించటం వల్ల వెంట్రుకల పెరుగుదల చాలా వరకు అరికట్టవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

తర్వాతి కథనం
Show comments