Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే...?

వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే...?
, సోమవారం, 3 డిశెంబరు 2018 (19:51 IST)
సౌభాగ్యానికి, ఆరోగ్యానికి సంకేతాలు పసుపు, కుంకుమలు. హిందూ సంస్కృతిలో పసుపుకుంకుమలకు విశిష్టమైన స్థానం ఉంది. ఆడవాళ్ళ అయిదవతనానికి, ముత్తైదువుల మాంగల్యానికి రక్ష పసుపు కుంకుమలు. పసుపు అనేక రకములైన వ్యాధులను నయం చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందనీ ఇటీవల పరిశోధనలో వెల్లడయ్యింది. పసుపు వల్ల ఆరోగ్యమే కాకుండా అందం కూడా మన సొంతం అవుతుంది. పసుపు వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. రక్తహినతతో బాధపడేవారు ప్రతిరోజు పసుపు, త్రిఫలా చూర్ణం, నెయ్యి, తేనె.... టీ స్పూను మోతాదులో తీసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు సేవించడం వల్ల రక్త హీనత సమస్య నుండి బయటపడవచ్చు.
 
2. గర్భధారణ సమయంలో రక్తస్రావం కనిపిస్తుంటే..... మరిగే నీళ్లకు రెండు చెంచాలు పసుపుని చేర్చి కొంచెం చల్లారాక ప్రతిరోజూ, రక్తస్రావం ఆగిపోయేంత వరకు సేవించాలి.
 
3. పసుపుని అడ్డసరం ఆకుల రసంతో కలిపి మెత్తగా మీగడతో కలిపి నూరి ఒక టీ స్పూను మోతాదులో తీసుకుంటే పొడిదగ్గు తగ్గుతుంది.
 
4. పసుపు సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. శరీరంపై ఏర్పడిన గాయాలకు, పుండ్లుకు పసుపు పూస్తే సూక్ష్మక్రిములు ఆశించవు. సెప్టిక్ అవదు. త్వరగా మానుపడతాయి.
 
పసుపుతో సౌందర్య చిట్కాలు
1. నారింజ తొక్కల పొడిలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. 
 
2. మంచిగంధం, పసుపు సమానంగా తీసుకుని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించుకోవచ్చు.
 
3. వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం మృదువుగా, అందంగా ఉంటుంది. అంతేకాకుండా నిమ్మరసంలో పసుపు కలిపి రాసుకుంటే చర్మంపై ఏర్పడే అన్ని రకాల మచ్చలు మాయమవుతాయి.
 
4. పెసరపిండిలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగువ ఈ 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వుండరంతే...