Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగువ ఈ 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వుండరంతే...

ఇంగువ ఈ 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వుండరంతే...
, సోమవారం, 3 డిశెంబరు 2018 (19:38 IST)
ఇంగువ వలన చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువను పురాతన కాలం నుండి అజీర్తికి ఇంటివైద్యంగా ఉపయోగిస్తున్నారు, అందువల్లనే దీనిని అలవాటుగా భారతీయ వంటకాలలో ప్రతి రోజు ఉపయోగిస్తుంటారు. దీనిలో కడుపు మంటను తగ్గించే గుణం, యాంటిఆక్సిడెంట్ లక్షణాలు, చికాకు పెట్టే కడుపు, పేగులో వాయువు, పేగు పురుగులు, అపానవాయువు, చికాకుపెట్టే పేగు వ్యాధి, అజీర్తి లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. 
 
1. ఒక అరకప్పు నీటిలో చిన్నచిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కల్గుతుంది. స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యలు నొప్పి, తిమ్మిరి,  వంటి వాటికి ఇంగువ చక్కగా పని చేస్తుంది. 
 
2. వంటలలో ఉపయోగించే ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు కూడా వాడతారు. దీనిని కామాతురత పెంచడం, నిరోధకంగా కూడా వాడవచ్చు.
 
3. ఇంగువ శ్వాస సంబంధ అంటువ్యాధులను తగ్గించడానికి, శ్వాస ఉత్తేజపరిచే ఒక మందుగా, కఫము తగ్గించటానికి, ఛాతీ పైన ఒత్తిడి తగ్గించటానికి బాగా పనిచేస్తుంది. తేనే, అల్లంతో కూడిన ఇంగువను దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటిశ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం కోసం వాడటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
4. ఇంగువను డయాబెటిస్ వైద్యంలో వాడతారు, ఇది క్లోమ కణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి తద్వారా మరింత ఇన్సులిన్ స్రావాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కాకర కాయను ఇంగువతో కలిపి వండటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
5. ఈ ఔషధ మూలిక వైద్యప్రభావంతో పాటుగా అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది. 
 
6. ఆహారంలో వాడే ఈ రుచికరమైన పదార్ధం నరాలను ఉత్తేజితం చేస్తుంది. అందువలన ఇది మూర్ఛ, వంకరలు పోవటం, సొమ్మసిల్లుట, ఇతర నాడీ సమస్యమనుండి రక్షణ కల్పిస్తుంది. 
 
7. నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది.
 
8. నిమ్మరసంతో కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి ఒక అద్భుతంగా పని చేయవచ్చు.  
 
9. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడటం మంచిది. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ సమర్ధవంతంగా పనిచేస్తుంది.
 
10. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పు అధికంగా తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?