బ్రెడ్‌ను అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెడ్‌తో తయారయ్యే పిజ్జా, మఫిన్స్ వంటి అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని.. ఇందులోని హై కెలోరీలు ఒబిసిటీకి దారితీస్తాయి. బ్రెడ్ ముక్కల్లోని పంచదార స్థాయిలు డయాబెటిస్‌కు దారితీస్తాయి. ఇన్సులిన్ స్థాయిలను వైట్ బ్రెడ్ పెంచేస్తుంది. అయితే గోధుమలతో చేసిన బ్రెడ్ ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.
కానీ వైట్ బ్రెడ్ తీసుకుంటే బరువు పెరుగుతారని.. అధికంగా తీసుకుంటే.. ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొన్ని ఫాస్ట్ పుడ్స్ సెంటర్లలో ఉపయోగించే బ్రెడ్లలో పొటాషియం, బ్రోమేట్, అయోడెట్ వంటి క్యాన్సర్ కారకాలున్నాయని.. వాటివల్ల థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం వుంది.
బ్రెడ్ తయారీకి పిండిని తయారు చేసుకునే ప్రాసెస్‌లో వినియోగించే రసాయనాలు, జన్యుపరంగా రూపాంతరం చెందించిన సోయా లెసిథిన్, కార్న్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్, సోయాపిండి పేపర్లు, నిల్వ వుంచే రసాయనాలు, మితిమీరిన చక్కెర బ్రెడ్‌లో వుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. కాబట్టి బ్రెడ్‌ను ఎంత తక్కువ తింటే అంత మంచిది.
ఆహారంలో ఎక్కువశాతం బ్రెడ్‌ని ఎక్కువకాలం వాడితే దీర్ఘకాలంలో పోషకాహార లోపం కలుగుతుంది. వైట్ బ్రెడ్‌లో కంటే గోధుమ బ్రెడ్‌లో పోషకాలు కాస్త మెరుగ్గా వుంటాయి. తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ కాస్త బెటరని.. కాకపోతే ఇందులో పండ్లు, నట్స్ కూరగాయలతో పోలిస్తే పోషకాలు తక్కువని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.