రాత్రివేళ చేసే భోజనంతో పాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది. ఎందుకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిదని వారు సూచన చేస్తున్నారు.
'పత్యం శతగుణం ప్రోక్తం' అన్నారు మన పెద్దలు. కనుక సర్వ వైద్యములకు పత్యం చేయడం మిక్కిలి శ్రేయస్కరం. అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్త చింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు. రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది కాబట్టి.. నిమ్మ, ఉసిరి పచ్చడిని తినకుండా ఉండటం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు.