బెల్లీ అందంగా వుండాలనుకుంటే.. ఆహారంలో మార్పులు తప్పనిసరి అంటున్నారు న్యూట్రీషియన్లు. ఆహారంలో తీసుకునే జాగ్రత్తల ద్వారా శరీరాకృతిని మెరుగ్గా వుంచుకోవచ్చు. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. తద్వారా నిత్యయవ్వనులుగా కనిపించవచ్చునని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.
అందుకే ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత తీసుకోవాలి. పాలు తాగే అలవాటున్నవారు కొవ్వులేని పాలును తీసుకోవడం మంచిది.
కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్టవద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా మారుతుంది. ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెలకంటే ముడిబియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వండి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి.
కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటుఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బానపొట్ట పెరగడం ఖాయం. అలాగే ఉదయం పూట అర గుప్పెడు బాదం పప్పులు తీసుకోవాలి.
రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని సేవించాలి. ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా రెండు మూడుసార్లు కొద్దికొద్దిగా తినడం ద్వారా పొట్ట పెరగదు.. ఇంకా ఆకర్షణీయమైన బెల్లీ మీ సొంతం అవుతుందని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు.