Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి...(video)

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:28 IST)
జుట్టు రాలడం, చుండ్రు ఇబ్బంది పెట్టడం సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం వుంటుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.
 
బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరినూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకలకు రాస్తుంటే అవి సహజసిద్ధమైన మెరుపుతో తన పూర్వాకృతిని పొందుతాయి. జుట్టు మెత్తగా మారి, వెంట్రుకలు పొడవుగా అవుతాయి. 
 
250 గ్రాముల మజ్జిగ, పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకుని తలకు పట్టించుకుని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది. నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది.
 
మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. 
 
పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్‌ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. 
 
ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని... వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments