వేసవి వచ్చేసింది. భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఎండ వేడిమికి తాళలేక నరాలు, చర్మానికి సంబంధించిన రుగ్మతలను తొలగించుకునేందుకు పెరుగు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పండ్ల రసాలు శరీరానికి కావలసిన విటమిన్ సిని అందిస్తుంది. అలాగే పెరుగు కూడా శరీరానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ పెరుగును మజ్జిగ రూపంలో రోజూ సేవించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే పుల్లటి పెరుగును తలమాడుకు పట్టిస్తే.. శిరోజాలు మృదువుగా తయారవుతాయి. పులుపు లేని పెరుగులో కొబ్బరి ముక్కలను చేర్చితే రెండు మూడు రోజులైనా పెరుగు పులుపు చెందదు. ఉదర సంబంధిత రుగ్మతలకు పెరుగు మెరుగ్గా పనిచేస్తుంది. పొట్టలోని క్రిములను ఇది తొలగిస్తుంది.
పెరుగు, మజ్జిగలోని లాక్టిక్ ఆమ్లాలు క్రిములను దూరం చేస్తాయి. పచ్చకామెర్లను తరిమికొట్టాలంటే.. పెరుగు లేదా మజ్జిగలో కాసింత తేనెను కలిపి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలకు చెక్ పెట్టాలంటే పెరుగులో కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే సరిపోతుంది. చర్మ వ్యాధులున్నవారు మజ్జిగలో తెల్ల బట్టను తడిపి.. ఆ ప్రాంతంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది.
చర్మ సంబంధిత వ్యాధులకు మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. పెరుగు, మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎముకలను దృఢంగా వుంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.