ఆముదం వర్షాకాలంలో చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఆముదాన్ని వేడి చేసి రాసుకోవడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. ఆముదాన్ని వేడి చేసి చర్మానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మంపై వున్న మృతణాలు తొలగిపోతాయి. మెరిసే చర్మం పొందవచ్చు. అలాగే వేడి చేసిన ఆముదమును రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి.. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేస్తే .. పగిలిన పాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొంత మందికి చిన్న వయస్సులోనే చర్మంపై ముడతలు పడుతాయి. అలా ముడతలు పడిన చర్మానికి వేడి చేసిన ఆముదమును రాసి, మెల్లగా మర్దనా చేస్తే మంచి ఫలితం వుంటుంది. నిత్యయవ్వనులుగా వుంటారు. అలాగే ఆముదముతో.. బేకింగ్ సోడా కలిపి మచ్చలపై రాస్తే.. చర్మంపై ఉన్న మచ్చలు తొలిగిపోతాయి. చర్మంపై గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఈ ఆముదం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి మంచి మాయిశ్చ్చరైజర్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఆముదం నూనెను ఉపయోగించాలి. ఇది జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. అలాగే చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది. ఆముదం నూనెలో రెండు చుక్కల కొబ్బరి నూనె, ఆలివ్ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు తగ్గటమే కాక జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది.