Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశ సౌందర్యం, కేశాల ఆరోగ్యం కోసం చిట్కాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (22:04 IST)
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమంతప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
 
కొబ్బరినూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరిసిపోకుండా ఉండటానికి ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  
 
రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని మూడింటిని బాగా కలపాలి. దీన్ని జుట్టు చివర్లకు వచ్చేలా రాసుకొని పదిహేను నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగటమే కాకుండా చివర్లు చిట్లిపోకుండా అందంగా వంపు తిరిగి ఉంటాయి.
 
కుంకుడు కాయలను గంటసేపు నీటిలో నానబెట్టి దానిలో కాస్త ఉసిరి పొడిని కలపాలి. ఈ మిశ్రమంతో తలస్నానం చేస్తే శిరోజాలు పట్టుకుచ్చులా నల్లగా నిగనిగలాడతాయి.
 
నిమ్మకాయ గింజలు, కొద్దిగా మిరియాలు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని  తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments