పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రిపూట ముఖానికి రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధముగా చేయడం వలన మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.
ముఖం మీద మొటిమల వల్ల ఏర్పడే నల్ల మచ్చలకు జాపత్రిని పాలల్లో బాగా అరగదీసి రాత్రి పడుకునే ముందు ముఖం మీద నల్లని మచ్చలు ఉన్నచోట రాయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖం కడిగివేయాలి. ఇలా పదిరోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద గుజ్జు సౌందర్య సాధనాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బెటాకేరటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలను వంటి సమస్యలను నివారించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.
రోజ్ వాటర్లో చందనం పొడి పసుపు నీళ్లలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసి పది నిమిషముల తరువాత కడగాలి. ఇలా తరచూ చేయడం వలన ముఖం కాంతివంతంగా ఉంటుంది.