Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెన్సార్ టెక్నాలజీతో ఫేస్ మాస్క్.. ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే..?

Advertiesment
సెన్సార్ టెక్నాలజీతో ఫేస్ మాస్క్.. ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే..?
, బుధవారం, 30 జూన్ 2021 (16:30 IST)
Mask
ఫేస్ మాస్క్‌లతో కొవిడ్-19 నిర్ధారణ సాధ్యమేనని అంటున్నారు హార్వర్డ్ అండ్ ఎంఐటీ రీసెర్చర్లు. సరికొత్త సెన్సార్ టెక్నాలజీ ద్వారా కొవిడ్-19 నిర్ధారించవచ్చునని చెబుతున్నారు. కొవిడ్ నిర్ధారణ కోసం రీసెర్చర్లు ఓ కొత్త సెన్సార్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఈ ఫేస్ మాస్క్ ధరించినవారికి కరోనావైరస్ ఉందో లేదో వెంటనే తెలుసుకోవచ్చునని అంటున్నారు. మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు హార్వర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు.  
 
ఫేస్ మాస్క్‌లతో పాటు, ప్రోగ్రామబుల్ బయోసెన్సర్‌లను ఇతర వస్త్రాలతో కలిపి ధరించడం ద్వారా ప్రమాదకరమైన పదార్థాలను ముందుగానే గుర్తించవచ్చునని చెబుతున్నారు. మూడేళ్ల పరిశోధన ఫలితమే ఈ టెక్నాలజీ అని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు మొదట ఈ టెక్నాలజీని 2015లో జికా వైరస్‌ను గుర్తించడానికి ఒక టూల్ ఉపయోగించారు. అందులో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. 
 
ఇప్పుడు మరికంత సాంకేతికతను జోడించి ఫేస్ మాస్క్ మాదిరిగా ధరించగలిగేలా డెవలప్ చేశారు. ఈ పరిశోధనకు డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ, హార్వర్డ్ యూనివర్శిటీ జాన్సన్ అండ్ జాన్సన్ నిధులు సమకూర్చాయి.
 
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా శ్వాసలో కరోనావైరస్ కణాలు ఉన్నాయో లేదో 90 నిమిషాల్లో గుర్తించగలదు. ఈ మేరకు పరిశోధకులు విడుదల చేసిన శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడించారు.
 
ఫేస్ మాస్క్ పై అమర్చిన సెన్సార్ ఫీచర్.. బటన్-యాక్టివేట్ అవుతుంది. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఫలితాలు గోల్డ్-స్టాండర్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షల వలె ఖచ్చితమైనవి అని పరిశోధకులు స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే మహిళకు మూడు డోసుల వ్యాక్సిన్.. నిమిషాల వ్యవధిలో...