కంటి కిందటి నల్లటి చారలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (14:37 IST)
పండగ హడావుడి.. ఇంటి అలంకరణ పనులతో, ఇంటికొచ్చిన అతిథులకు వండివార్చే పనిలో తీవ్రమైన అలసటతో ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు మళ్ళీ మీరు ఉత్సాహాన్ని పొందుతారు. ప్రతి రోజూ ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.
 
అవిసెనూనెలో తగినంత నిమ్మరసం కలిపి జుట్టుకు రాసి మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. శిరోజాలకు నూనె రాసి అరగంటాగి.. అప్పుడు కండీషనర్ కలిసిన షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేస్తే శిరోజాలు అందంగా మెరిసిపోతాయి. స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ మీగడ, అరస్పూన్ తేనె, పావు స్పూన్ బాదం నూనెను పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చర్మం పొడిబారకుండా, కాంతివంతంగా తయారవుతుంది.
 
గులాబీ నీళ్లలో దూదిని నానబెట్టి కళ్ల కింద అప్పుడప్పుడూ తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. పలుచగా తరిగిన బంగాళాదుంప చక్రాలను కానీ, నిమ్మరసంలో ముంచిన కీరదోస ముక్కలని కానీ కళ్లపై ఉంచి 3 నిమిషాల తర్వాత తీసేసినట్లైతే కళ్లమంటలు తగ్గి మనసుకు హాయిగా ఉంటుంది. కళ్లలో అలసట ఛాయలు, నల్ల చారలు ఉన్ననట్లైతే కొద్దిగా కన్సీలర్ రాసి, ఆపై లేత వర్ణంలో ఉన్న పసిడి వర్ణపు ఐ షాడోను వేసుకొంటే కళ్లు చూడచక్కగా అందంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments