Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి తీసుకుంటే.. కలిగే లాభాలివే..?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (13:31 IST)
కొందరైతే ఎప్పుడు చూసిన ఏదో పోయినట్టులు టెన్షన్ టెన్షన్‌గా ఉంటారు. ఇలా ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. పావు కప్పు ఉల్లి ముక్కల్ని తీసుకుంటే మంచిదంటున్నారు. ఉల్లిపాయల్లో ఉండే క్వార్సిటిన్ ఒత్తిడిని నివారిస్తుంది.
 
ఎక్కువగా పనిచేసేవారు.. ఆహారంతో పాటు చిన్న చిన్న పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఉల్లిపాయ ముక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయలోని విటమిన్స్ ఒత్తిడి, అలసట నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. కనుక ప్రతిరోజూ కప్పు లేదా పావుకప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.  
 
ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 
 
ఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాలనన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే హృద్రోగ లోపాలతో ఇబ్బందులు తప్పవు. అందువలన గుండె జబ్బులతోనూ, హైబీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments