Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుమ్మడి నూనెతో అలా చేస్తే...

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:52 IST)
గుమ్మడి చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. గుమ్మడిలోని కెమికల్స్, మినరల్స్ మెుటిమల నుంచి రక్షణకు చక్కగా పనిచేస్తాయి. గుమ్మడి శరీరంపై గల మృతకణాలను తొలగిస్తుంది. దీనిని ఉపయోగిస్తే.. చర్మం తాజాగా మారుతుంది. పొడిబారిన చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. గుమ్మడిలోని మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
గుమ్మడి నూనె కొబ్బరినూనెలా పనిచేస్తుంది. గుమ్మడి నూనెలో విటమిన్ ఎ, కె, ఇ, పొటాషియం, కాపర్, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా చుండ్రు సమస్య నుండి విముక్తి లభించేలా చేస్తాయి. గుమ్మడిని తరచు తీసుకుంటే శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. 
 
1. గుమ్మడిని గుజ్జులా చేసుకుని అందులో స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం, స్పూన్ విటమిన్ ఇ నూనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇది బాగా ఆరిన తరువాత నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది. 
 
2. గుమ్మడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో స్పూన్ కొబ్బరి నూనె, తేనె, పెరుగు కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు రాదు.
 
3. గుమ్మడి గింజలను పొడి చేసి అందులో అరస్పూన్ యాలకుల పొడి, అరకప్పు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆపై 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. జిడ్డు చర్మం పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments