సాధారణంగా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. దీని కారణంగా ముఖంపై మచ్చలు, మెుటిమలు వంటివి వస్తుంటాయి. నిద్రలేమికి దూరంగా ఉండాలంటే.. వాము తీసుకోవాలి. వాము ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి వాములోని ప్రయోజనాలేంటో చూద్దాం..
నిద్రలేమి వలన వచ్చిన మెుటిమలు, మచ్చలు తొలగించాలంటే.. ఇలా చేయాలి. వాము పొడిలో పావు స్పూన్ వంటసోడాలో కొద్దిగా సెనగపిండి, మీగడ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే నిద్రలేమి కారణంగా వచ్చిన మెుటిమలు తొలగిపోతాయి.
జాజికాయను వెచ్చని నీటిలో అరగదీసి దాని ద్వారా వచ్చినా గంధాన్ని తీసి అందులో కొద్దిగా వాము పొడి, పాలు కలిపి మెుటిమలపై రాయాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా తరచుగా చేస్తే నచ్చటి మచ్చలు పోతాయి. వామును నూనెలో వేయించి మెత్తని చూర్ణంలా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా పెరుగు కలిపి మెుటిమలపై పూతలా వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.