కొత్తిమీరతో ఫేస్ ప్యాక్.. చర్మం మెరిసిపోతుంది.. తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (17:43 IST)
Coriander face pack
కొత్తిమీరతో ఆరోగ్యానికే కాదు.. అందానికి మంచిదే. గుప్పెడు తాజా కొత్తిమీర తరుగులో రెండు చెంచాల కలబంద రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. కలబంద ముడతలు, గీతలను తగ్గిస్తుంది. 
 
ముఖంపై ఉండే నలుపుదనం, బ్లాక్‌హెడ్స్ తగ్గించుకోవడానికి కొత్తిమీర, నిమ్మరసం చక్కని పరిష్కారం. కొత్తిమీర ముద్దలో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. కొత్తిమీర ముద్దలో కాసిని పాలు, చెంచా తేనె, నిమ్మరసం కలపాలి. దీనిని ముఖానికి పూతలా వేసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే.. చర్మం మెరిసిపోతుంది. 
 
ఇంకా రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును, గుప్పెడు వేపాకుని కలిపి నీటిలో మరిగించాలి. ఆ నీళ్లలో రోజూ ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. బొప్పాయి గుజ్జులో చెంచా పాలు, చెంచా తేనె కలిపి దాన్ని ముఖానికి రాసి.. మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ఇంధన పొదుపు పిలుపు: విధాన్ భవన్‌కి మోటాల్ సైకిల్ పైన వచ్చిన మహారాష్ట్ర సీఎం, వీడియో

కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు

శస్త్రచికిత్స అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్

నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?

ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments