కరివేపాకు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దాదాపు ఓ స్పూన్ కరివేపాకు పొడిని తీసుకుని ఒక గ్లాసుడు నీటిలో కలుపుకోవాలి. వీటికి అదనంగా కొత్తిమీరా, పుదీనాను కూడా కలుపుకోవచ్చు. ఈ గ్రీన్ జ్యూస్‌ని పొద్దున్నే తాగితే శరీరానికి కావాల్సిన క్లోరోఫిల్‌తో పాటూ ఎన్నో విటమిన్స్ కూడా అందుతాయి.
ఈ గ్రీన్ జ్యూస్‌ని రోజూ తాగితే కొన్ని రోజుల తరువాత పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ జ్యూస్‌తో తప్పకుండా బరువును తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే రోజు భోజనంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. కరివేపాకు ఆకులను నలిపి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.
కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేయించి, పొడి చేసి రోజు రెండు చెంచాలు తీసుకోవటం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.