Tomato face pack benefits
ప్రతిరోజూ టమోటాను ఉపయోగిస్తే ఆయిలీ ఫేస్ వున్న వారికి మంచి ఫలితం వుంటుంది. మొటిమలను ఇది దూరం చేస్తుంది. ఆయిలీ ఫేస్‌కు చెక్ పెట్టాలంటే.. రోజూ టమోటాను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. తద్వారా చర్మం కాంతివంతం అవుతుంది. సాయంత్రం పూట టమోటా జ్యూస్ ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ చేర్చి.. ఆ మిశ్రమంతో ముఖాన్ని వాష్ చేస్తే చర్మం మెరిసిపోతుంది.
శనగపిండిని టమాట గుజ్జుతో కలిపి కొంచెం నిమ్మరసం వేసి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ప్రభావం కనిపిస్తుంది. టమాటాల గుజ్జుని పాలతో కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.
టమోటా జ్యూస్ రెండు స్పూన్లు, పెరుగు కాసింత, తేనె, నిమ్మరసం చెరో స్పూన్ చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే.. మంచి ఫలితం వుంటుంది. ఇలా వారానికి ఓసారి చేస్తే చర్మకాంతి పెంపొందుతుంది. మొటిమలు తొలగిపోతాయి. రోజూ టమోటాతో ముఖానికి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు.