'కలబంద' మనకు పరిచయం అవసరం లేని మొక్క. కానీ, ఇది చేసే మంచి పనుల గురించి చాలా మందికి తెలియదు. కలబంద చూడటానికి పిచ్చి మొక్కలాగా కనిపిస్తుంది. కానీ, ఇది చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. అందుకే, కలబందను సర్వరోగ నివారిణి అంటారు.
కలబంద మొక్కని సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు.
కలబంద నుండి రకరకాల లోషన్లు, క్రీమ్‌లు, జ్యూస్, హెయిర్ ఆయిల్ లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాంటి కలబంద నుంచి వచ్చే జెల్లీని తేనెతో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం...
* బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
* మలబద్దకాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.
* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* కణాల క్షీణతను తగ్గిస్తుంది.
* కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* గాయాలు త్వరగా మాన్పుతుంది.
* హానికరమైన రోగాలు రాకుండా కాపాడుతాయి.
* మీలో శక్తిని పెంచుతాయి.
* అలోవెరా గుజ్జు చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలు ఉన్నాయి.
అలెవెరా గుజ్జుతో చుండ్రు వదిలిపోతుంది. జట్టు మెరుస్తూ స్మూత్‌గా మారుతుంది.