Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి దగ్గు, జలుబును అడ్డుకుని రోగనిరోధక శక్తిని పెంచుతాయి

ఇవి దగ్గు, జలుబును అడ్డుకుని రోగనిరోధక శక్తిని పెంచుతాయి
, సోమవారం, 9 నవంబరు 2020 (21:30 IST)
కరోనావైరస్ కారణంగా ప్రజల్లో ఏమాత్రం దగ్గు, జలుబు వచ్చినా భయపడిపోతున్నారు. అది సాధారణమైనదో లేదంటే కరోనావైరస్ ఏమోనని బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మన ఇంట్లో వాడే పదార్థాలతోనే మనం దగ్గు, జలుబు తగ్గించుకునే అవకాశాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
1. కరక్కాయను పగులగొట్టి చిన్న ముక్కను, బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కొద్ది కొద్దిగా మింగుతూ ఉంటే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. చేదుగా, వగరుగా ఉండే కరక్కాయ రసం మంచి ఫలితాన్నే ఇస్తుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాలకుల పొడి, లవంగాల పొడి కలుపుకుని నెమ్మదిగా చప్పరిస్తూ తాగితే మంచి గుణం కనిపిస్తుంది.
 
3. ఒక అర చెంచా అల్లం రసంలో ఒక చెంచా చేనె కలుపుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే దగ్గుతో పాటు దానివల్ల కలిగే ఆయాసం కూడా తగ్గిపోతుంది.
 
4. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా యాలుకుల పొడి, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తీసుకుంటే దగ్గు తగ్గి సుఖనిద్ర పడుతుంది. అలాగే మిరియాల కషాయం కూడా దగ్గుని, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.
 
5. ఒక స్పూన్ తులసి ఆకుల రసానికి సమపాళ్లలో తేనె కలిపి వాడితే కఫం వల్ల వచ్చే దగ్గు తగ్గి ఉపశమనం కలుగుతుంది. అలాకాకుంటే తులసి ఆకులను నమిలినా మంచి ఫలితం ఉంటుంది.
 
6. శొంఠిని నీళ్లలో కలిపి కషాయంగా కాచి అందులో పటికబెల్లం కలుపుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం, సేవిస్తూ ఉంటే దగ్గు, జలుబు త్వరగా తగ్గుతుంది. అలాగే శొంఠితో కాచే కాఫీ, టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  
7. కాఫీ, టీ త్రాగేవారు అందులో అల్లాన్ని ఉపయోగించాలి. దీని వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
8. ఒక టీ స్పూన్ మునగ ఆకు రసాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ నియంత్రణకు వాడే మందులతో అనేక కోవిడ్ అనంతర సమస్యలు