Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలిపి...

Webdunia
బుధవారం, 24 జులై 2019 (22:43 IST)
మనకు సహజసిద్దంగా లభించే నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే విషయం మనందరికి తెలిసిందే. కానీ నిమ్మరసం చర్మ సౌందర్యానికి మృత కణాలను తొలగించడానికి, బ్లాక్‌హెడ్స్‌ను పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీనివలన ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
 
2. ముఖచర్మం మృదువుగా ఉండాలంటే పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
3. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా అవ్వాలంటే పచ్చిపాలలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
 
4. అర చెక్క నిమ్మరసానికి కొద్దిగా నీళ్లు అర చెంచా తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషముల తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వలన ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. 
 
5. రెండు చెంచా నిమ్మరసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. దీనివలన తేమతో పాటు ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments