Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమ సమస్యతో బాధపడుతున్నారు..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:55 IST)
నేటి తరుణంలో చాలామంది మెుటిమ సమస్యతో ఎక్కువగా భాదపడుతున్నారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని చింతిస్తుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
 
1. టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
2. పాలలో కొద్గిగా తేనె, స్పూన్ పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
 
3. చందనంలో స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొటిమలు పోతాయి.
 
4. బంగాళాదుంపలను పేస్ట్ చేసి ముఖానికి పట్టించి.. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే.. ముఖంపై గల నల్లటి మచ్చలు పోతాయి.
 
5. సాధారణంగా పాల మీగడను అంతగా ఉపయోగించరు. ఈ మీగడను ముఖానికి రాసుకుంటే.. ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments