కోడిగుడ్డును ఆహారంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులోని న్యూట్రియన్ ఫాక్ట్స్ చర్మం రక్షణకు చాలా దోహదపడుతాయి. చాలామందికి గుడ్డు వాసన అంటే.. అస్సలు పడదు. ఈ వాసన కారణంగానే కోడిగుడ్డును ఎక్కువగా అందానికి వాడనంటున్నారు. ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక గుడ్డు వాడలనిపిస్తుంది. మరి అవేంటో చూద్దాం..
కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్:
కోడిగుడ్డులోని పచ్చసొన, 2 స్పూన్స్ బాదం నూనె, వెన్న తీసిన పాలు, కొద్దిగా కర్పూరం కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.
గుడ్డులోని పచ్చసొన 2 స్పూన్, ఫ్రెష్ గులాబీ పువ్వుల రసం 2 స్పూన్స్.. ఈ రెండింటిని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ఎంతో సౌందర్యంగా, మృదువుగా తయారవుతుంది. మొటిమలు రావు.
కోడిగుడ్డులోని తెల్లసొన 1 స్పూన్, పాల మీగడ 1 స్పూన్, నిమ్మరసం 5 చుక్కలు.. ఈ మూడింటిని బాగా కలిపి, రోజూ రాత్రివేళ పడుకునే ముందు చర్మానికి రాసుకుని మసాజ్ చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ విధంగా చేస్తే మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
మొటిమలున్నవారు వెల్లుల్లి రేకులు మూడు నూరి దాన్ని గుడ్డు తెల్లసొనలో కలిపి.. ఆ మిశ్రమానికి 1 స్పూన్ కాలమైన్ చేర్చి.. ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ప్యాక్ మొటిమల్ని బాగా తగ్గిస్తుంది.