Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖానికి ఆవిరి పట్టిస్తే.. కలిగే ప్రయోజనాలివే..?

Advertiesment
face
, గురువారం, 27 డిశెంబరు 2018 (15:56 IST)
ముఖచర్మం అందంగా మారాలంటే స్టీమింగ్ ట్రై చేస్తే చాలంటూన్నారు బ్యూటీషియన్లు. ముఖానికి స్టీమింగ్ (ఆవిరి) పట్టడం వల్ల చర్మం ఫ్రెష్‌గా తయారవుతుంది. చర్మంలోని రంధ్రాలు తెరచుకొని చర్మం లోపలినుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. 
 
ఫేషియల్ స్టీమింగ్‌తో ఇటు అందానికి అటు ఆరోగ్యానికి రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖర్చులేనటువంటి పద్ధతిని ఇంట్లో ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ ఫేస్ స్టీమింగ్ పద్దతి ఫాలో చేస్తే చాలు.. 
 
ఫేస్ స్టీమింగ్‌తో బ్యూటీ బెనిఫిట్స్ ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ స్టీమింగ్‌ను 5 నుండి 10 నిమిషాల పాటు పడితే సరిపోతుంది. ఆవిరి పట్టిన తరువాత ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో ముఖంలో ఉన్న వైట్‌హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. 
 
ఫేస్ స్టీమింగ్ మాయిశ్చరైజర్‌గా పనిచేసి పొడిచర్మాన్ని తేమగా మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా ఉండేలా కాపాడుతుంది. ఒక వేళ ముఖంలో మొటిమలు ఉన్నట్లైతే ఈ ఆవిరిని 10 నిమిషాల లోపు మాత్రమే పట్టాలి. 
 
ఫేస్ స్టీమింగ్‌ను ఎలా పట్టాలంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరిగించుకుని ముఖం, తల కవర్ అయ్యేట్లు టవల్ కప్పుకొని డైరెక్ట్‌గా ముఖానికి ఆవిరి పట్టించాలి. చర్మాన్ని శుభ్రపరచుటలో ఇది సులభమైన చిట్కా. 
 
స్టీమింగ్ తరువాత ముఖాన్ని స్క్రబ్ చేయడం వలన ముఖచర్మంలో ఏర్పడ్డ టాక్సిన్స్, దుమ్మును, తొలగించి నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ముఖాన్ని తాజాగా మార్చుతుంది. ఫేస్ స్టీమింగ్‌ ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు.
   
ఇలా వేడిగా ఆవిరి పట్టిన తర్వాత అరగంట మాటు ముఖం రిలాక్స్డ్‌గా పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లటి ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇక ఐస్ క్యూబ్‌తో రుద్దడం వల్ల మొటిమలతో తెరచుకొన్న రంధ్రాలను మూతపెట్టేలా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.
 
ఎప్పుడైతే ముఖానికి వేడిగా ఆవిరి పడుతామో అప్పుడు చర్మంలోని మతకణాలను తొలగిస్తుంది. చర్మ కణాలను తెరుచుకొనేలా చేసే తేమనందిస్తుంది. ఈ పద్దతి ద్వారా చర్మంలో పేరుకొన్న దుమ్ము, ధూళి వెలుపలికి నెట్టివేయబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడక వ్యాయామం... ఇలా చేస్తే మంచి ఫలితాలు...