Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతి పిండిని తలకు పట్టిస్తే..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (12:57 IST)
ఈ సీజన్ వేరియేషన్ కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దాంతో చుండ్రు కూడా విపరీతంగా వచ్చేస్తుంది. ఈ చుండ్రు కారణంగా నలుగురిలో నిలబడాలంటే చాలా కష్టంగా ఉంది. చూసేవాళ్ళు కూడా చిన్నతనంగా భావిస్తుంటారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లోని ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు.. బ్యూటీ నిపుణులు.. మరి అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
 
ఆలివ్ ఆయిల్ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రుని తొలగించుటలో ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని జుట్టుకి పట్టించి మర్దన చేయాలి. తర్వాత జుట్టుని ఒక టవల్‌తో చుట్టుకోవాలి. ఆపై అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా చుండ్రు సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. 
 
వెనిగర్‌ని, నీటిని సమపాళ్ళలో తీసుకు‌ని జుట్టుకి పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, పుల్లటి పెరుగుని తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాక జుట్టు మెరుస్తుంది.

2 స్పూన్లు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి నాడు వాటిని పిండిగా చేసి మీ తలకు పట్టించుకుని 15-20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్నానం తరువాత జుట్టుని ఈ నీటితో శుభ్రం చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేగాక జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments