Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exit Poll: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరంటే..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (20:33 IST)
ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగిశాయి. మార్చి 10న కౌంటింగ్ జరుగనుంది. సోమవారం ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మెజారిటీ వస్తుందని, ఉత్తరాఖండ్‌లో పోటాపోటీగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. వివిధ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..

 
పంజాబ్‌
మొత్తం 117 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆప్‌ 76-90 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. కాంగ్రెస్‌కు 19 నుంచి 31 సీట్లు, బీజేపీకి 1-4, అకాలీ దళ్‌కు 7-11 సీట్లు రావొచ్చు. ఏబీపీ న్యూస్ అంచనాల ప్రకారం, ఆప్‌కు 51 నుంచి 61 సీట్లు, కాంగ్రెస్‌కు 22 నుంచి 28 సీట్లు రావొచ్చు. టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ సర్వే ప్రకారం, ఆప్‌ 56-61, కాంగ్రెస్‌ 24-29, అకాలీదళ్‌ 22-26, బీజేపీ 1-6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. రిపబ్లిక్ టీవీ, పి-మార్క్ (P-Marq) అంచనాల ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీకి 62 నుండి 70 సీట్లు రావొచ్చు. కాంగ్రెస్‌కు 23 నుంచి 31 సీట్లు, శిరోమణి అకాలీదళ్‌కు 16 నుంచి 24 సీట్లు రావచ్చు.

 
ఉత్తర్‌ప్రదేశ్
ఉత్తర్‌ప్రదేశ్‌లో 403 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి 240 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ అంచనా వేసింది. బీజేపీకి 230 నుంచి 245 సీట్లు వస్తాయని ఈటీజీ రిసెర్చ్ అంచనా వేసింది. టీవీ9 అంచనాల ప్రకారం, బీజేపీ 211-225 సీట్లు, ఎస్పీకి 146-160 సీట్లు, కాంగ్రెస్‌కు 4-6, బీఎస్పీకి 14-24 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

 
ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లో గట్టి పోటీ నెలకొనవచ్చు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యం సాధిస్తుందని టైమ్స్ నౌ-వీటో అంచనా వేసింది. ఈ సర్వే మేరకు ఆ రాష్ట్రంలోని 70 స్థానాల్లో బీజేపీకి 37, కాంగ్రెస్‌కు 31, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ సర్వే ప్రకారం, బీజేపీకి 31-33 , కాంగ్రెస్‌కు 33-35, ఆప్‌కు 0-3, ఇతరులకు 0-2 సీట్లు రావచ్చు. కాగా, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ అంచనా వేసింది. వీరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్‌కు 32-38 సీట్లు, బీజేపీకి 26-32 సీట్లు రావచ్చు. ఇతరుల ఖాతాలో 3-7 సీట్లు రావచ్చు. ఇండియా టుడే యాక్సిస్ మై ప్రకారం బీజేపీకి 36-46 సీట్లు, కాంగ్రెస్‌కు 20-30 సీట్లు వస్తాయని అంచనా. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీఎస్పీకి 2-4 సీట్లు, ఇతరులకు 2-5 సీట్లు రావచ్చని అంచనా.

 
గోవా
గోవాలో 40 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయొచ్చని టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ అంచనా. ఈ సర్వే ప్రకారం, బీజేపీకి 17-19, కాంగ్రెస్‌కు 11-13 , ఆప్‌కు 1- 4, ఇతర పార్టీలకు 2-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈటీజీ రిసెర్చ్ అంచనాల ప్రకారం బీజేపీకి 17-20 సీట్లు, కాంగ్రెస్‌కు 15-17 సీట్లు రావొచ్చు. రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీలకూ 13-17 సీట్లు రావచ్చని అంచనా. ఇండియా టీవీ-గ్రౌండ్ జీరో రిసెర్చ్ మాత్రం గోవాలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వీరి సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 20 నుంచి 25 స్థానాలు, బీజేపీకి 10 నుంచి 14 స్థానాలు రావచ్చని అంచనా.

 
మణిపూర్
మణిపూర్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 60 స్థానాల్లో బీజేపీకి 23-28 సీట్లు, కాంగ్రెస్‌కు 10-14 సీట్లు రావొచని ఇండియా న్యూస్ అంచనా వేసింది. ఇండియా టుడే యాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, మణిపూర్‌లో బీజేపీకి 33-43 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 4-8 సీట్లు వస్తాయని అంచనా. ఇతర పార్టీలకు 10-23 సీట్లు రావచ్చు. పి-మార్క్ సర్వే ప్రకారం, బీజేపీ 27- 31, కాంగ్రెస్ 11-17 స్థానాలో గెలిచే అవకాశం ఉంది. ఏబీపీ న్యూస్ ప్రకారం, మణిపూర్‌లో బీజేపీకి 23-27 సీట్లు, కాంగ్రెస్‌కు 12-16, ఎన్‌పీపీకి 10-14 సీట్లు వస్తాయని అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments