Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#CWC22 #INDvsPAK భారత్-పాకిస్తాన్ జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా టపాసులు పేలవు ఎందుకు?

Advertiesment
#CWC22 #INDvsPAK భారత్-పాకిస్తాన్ జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా టపాసులు పేలవు ఎందుకు?
, శనివారం, 5 మార్చి 2022 (22:32 IST)
12వ వుమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత-పాకిస్తాన్ మహిళా జట్లు న్యూజీలాండ్‌లోని మౌంట్ మాంగనూయ్‌లో తలపడబోతున్నాయి. సాధారణంగా భారత్-పాక్ మ్యాచ్ అనగానే ప్రపంచమంతా ఆసక్తి ఎదురుచూస్తుంది. కానీ, ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోందో క్రీడా రచయిత శారదా ఉగ్రా వర్ణించారు. గత కొన్నేళ్లుగా భారత్, పాక్ మహిళా క్రికెట్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో వివరించారు.

 
సర్‌ప్రైజ్ ఏంటంటే ఈ ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు దీని గురించి ఊదరగొట్టేలా ఎలాంటి బిల్డప్ ఉండదు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అంటూ మీడియా హంగామా కనిపించదు, ఈ మ్యాచ్‌ను రెండు జట్ల మధ్య యుద్ధంలా వర్ణించడం లాంటివి అసలు జరగదు. ఎందుకంటే ఇది ఆ రెండు దేశాల మహిళా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్.

 
ప్రస్తుతానికి ఈ మ్యాచ్ గురించి రెండే రెండు వార్తలు వస్తున్నాయి. ఒకటి మౌంట్ మాంగనూయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఉపయోగించబోతున్నారు. రెండోది గత ఆదివారం ఒక వార్మప్ మ్యాచ్‌ గాయపడిన స్టార్ ఇండియన్ బ్యాటర్ స్మృతి మందన్న కోలుకున్నారు. భారత్, పాకిస్తాన్ పురుషుల జట్లలాగే మహిళా జట్లు కూడా ఐసీసీ లేదా ఖండాంతర ఈవెంట్స్‌లో ఆడుతుంటాయి. భారత్-పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు మొదటిసారి 2005లో ఆసియాకప్‌లో తలపడ్డాయి.

 
ఈ రెండు జట్లు ఆడిన 10 వన్డేల్లో అన్నిటిలో భారత మహిళా జట్టు పాకిస్తాన్‌పై గెలిచింది. మొత్తం 11 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడితే భారత్ ఒక్కటి ఓడింది. భారత్-పాక్ మహిళా క్రికెట్ జట్లు ఇప్పటివరకూ ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇందులో వారి తప్పు లేదు. ఎందుకంటే, రెండు దేశాల మహిళా జట్లు తమ రాజకీయ సంస్థల మధ్య వైరం పరిణామాలను భరించాల్సి ఉంటుంది.

 
అయితే, పురుషుల క్రికెట్ జట్టు తప్పేముంది అని మీరు వాదించవచ్చు. ఆ విషయానికి వస్తే దశాబ్దాల నుంచీ రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతల చరిత్ర ఉంది. అవి కాస్త చల్లారినపుడు రెండుదేశాల పురుషుల జట్లు మాత్రమే క్రికెట్ అభిమానులను సంతోషపెట్టడానికి పరస్పరం మ్యాచ్‌లు ఆడుతుంటాయి. దీనికి విరుద్ధంగా, భారత్-పాక్ క్రీడా పోటీల్లో తమదైన చరిత్ర లిఖించే అవకాశాన్ని రెండు దేశాల మహిళా జట్లకూ ఇవ్వడం లేదు.

 
భారత్‌లో మహిళా క్రికెట్‌ అధికారికంగా 1970ల మొదట్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు పాకిస్తాన్ మహిళా క్రికెట్ ఉనికిలోకి వచ్చింది. పాకిస్తాన్‌లో మొదటి మహిళా క్రికెట్ మ్యాచ్ నిర్వహించినందుకు కరాచీకి చెందిన ఖాన్ సిస్టర్స్ షైజా, షర్మీన్‌లకు చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని రచయిత కమీలా షంసీ తను రాసిన 'టెర్రిఫిక్ అకౌంట్ ఆప్ ది హిస్టరీ ఆఫ్ ది పాకిస్తానీ వుమెన్స్ టీమ్' పుస్తకంలో చెప్పారు.

 
అప్పుడు ఆ మ్యాచ్‌ చూసేందుకు స్టేడియంలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేకపోగా, కేవలం ఆటగాళ్ల భద్రత కోసమే 8 వేల మంది పోలీసులను నియమించారు. కానీ, భారత మహిళా క్రికెట్‌కు ఎదురయ్యే అతిపెద్ద ముప్పు మాత్రం నిధుల కొరత వల్లే వస్తుంది. 2006లో అది చివరకు బీసీసీఐలో మెర్జ్ అయ్యేవరకూ అలాగే జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లు పురుషుల జట్ల మధ్యే ఎందుకు, భారత-పాకిస్తాన్ మహిళా క్రికెట్‌ను కూడా అలాగే చేయచ్చుగా. ఎందుకంటే, పురుషుల జట్ల కోసం కాకుండా ఈ రెండు దేశాల మహిళా జట్ల మధ్య ఎలాంటి మ్యాచ్‌ల నిర్వహించాలన్నా, వాటికోసం చర్చలు జరపాలన్నా అది చాలా పెద్ద పని అవుతోంది.

 
రెండు మహిళా జట్ల మధ్య అంతరం ఉందని, రెండింటి మధ్యా పెద్దగా పోటీ ఉండదనే వాదన కూడా ఉంది. కానీ కోవిడ్ ఉన్నా లేకపోయినా ఈ మహిళా జట్లు రెండేళ్లలో ఒకసారైనా కలుస్తాయా లేదా అనేది మనకు తెలీదు. 2017 వుమెన్స్ వరల్డ్ కప్‌లో లార్డ్స్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. కొద్దిలో విజయం చేజార్చుకుంది. ఆ ప్రదర్శన భారత్‌లో మహిళా క్రీడల పబ్లిక్ ప్రొఫైల్‌ను మార్చేసింది. కానీ, అదే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.

webdunia
అప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదేళ్లలో 40 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన భారత్ 19 గెలిచి, 21 ఓడింది. అటు 34 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ 11 గెలిచి, 21 ఓటమిలు మూటగట్టుకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే పాకిస్తాన్ 8వ స్థానంలో ఉంది. మహిళా క్రికెట్‌లోకి కొత్తగా వచ్చిన బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌లతోనే ఈ జాబితాలో ఆరో ర్యాంక్ సాధించింది. ఈ రెండు ప్రపంచకప్‌ల మధ్య పాకిస్తాన్ న్యూజీలాండ్‌తో తన మొదటి విజయం అందుకుంది. వెస్టిండీస్‌పై పోరాటపటిమ చూపడంతోపాటూ, వార్మప్ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగకపోయినా న్యూజీలాండ్‌ను మరోసారి ఓడించింది.

 
భారత మహిళా జట్టు తమ ఓపెనింగ్ వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2 పరుగుల తేడాతో కష్టంగా గెలిచినా, తర్వాత వెస్టిండీస్ మీద సులభంగా విజయం సాధించింది. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఈ టోర్నీలో బలమైన జట్టుగా దిగుతోంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా హాట్ ఫేవరెట్. కానీ ఈ మ్యాచ్‌లో రెండు జట్ల ప్రదర్శన ఈ టోర్నీలో వాటి భవిష్యత్తు ఏంటి అనే ఒక ఐడియా ఇస్తుంది. పాకిస్తాన్‌కు ఉన్నట్లు బీసీసీఐలో వుమెన్స్ వింగ్ కూడా లేదు. వచ్చే ఏడాది మొదటిసారి నిర్వహించబోయే పాకిస్తాన్ వుమెన్స్ సూపర్ లీగ్‌కు ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా పచ్చజెండా కూడా ఊపేశారు.

 
వుమెన్స్ ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ కూడా హామీలు ఇచ్చింది. బీసీసీఐ సెక్రటరీ జైషా అది త్వరలో ప్రారంభమవుతుందని చెబుతూనే ఉన్నారు. ఆదివారం భారత్-పాక్ మహిళా జట్ల జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ తెల్లవారుజామున మొదలవుతుంది. అదే సమయంలో ఈ రెండు దేశాల పురుష జట్లు ఆడే టెస్ట్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి. భారత్ శ్రీలంకతో తలపడుతుంటే, పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో ఆడుతోంది. అయినప్పటికీ వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మహిళా జట్లు ఆడే ఈ ఈ మ్యాచ్‌ను చూస్తారు. ఎందుకంటే ఇది భారత్-పాకిస్తాన్ మ్యాచ్, అందుకే ఇది ఒక థ్రిల్ ఇస్తుంది.

 
పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ అత్యుత్తమ స్పిన్ బౌలర్. ఇటీవలే ప్రసూతి సెలవులు ముగించుకున్న ఆమె తన ఆరు నెలల పాపతో ఈ టోర్నీకి వచ్చారు. "పాకిస్తాన్, భారత్‌లో లక్షలాది యువతుల్లో ఒక ప్రేరణ నింపడానికి, క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోడానికి ఈ మ్యాచ్ ఒక మంచి అవకాశం" అని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య విడాకులకు ఒప్పుకోలేదు.. నర్సుతో భార్య ముందే శృంగారం