Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామ మందిరం.. పునాది రాయి పడింది..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (13:21 IST)
Ayodhya
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడది నిజరూపం దాల్చబోతోంది. ఈ మహాకార్యానికి బుధవారం పునాది రాయి పడింది. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమిపూజ కార్యక్రమం ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది.
 
కరోనా వైరస్ కారణంగా ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. బుధవారం ఉదయం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని తెలిపారు.
 
లంకపై దాడికి వెళ్లే ముందు రాముడు రుద్రాభిషేకంతో శివుణ్ని ప్రార్థించినట్టుగానే.. రామమందిర నిర్మాణాన్ని కూడా ప్రారంభించినట్టు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధిపతి మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ తెలిపారు. 
 
పురోహితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య రామాలయానికి పునాదులు వేశారు. మే 11న భూమిని చదును చేసే కార్యక్రమం మొదలవగా... ఆలయ నిర్మాణానికి ఇవాళ పునాది రాయిపడింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అయోధ్య రాముడి దర్శనం... సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. యథావిధిగా దర్శనాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments