పిఎం కేర్స్ ఫండ్‌కు యూనివన్ ఫౌండేషన్ విరాళం

గురువారం, 9 ఏప్రియల్ 2020 (15:21 IST)
ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ భార్యలచే నిర్వహించబడుతున్న 'యునైటెడ్ ఫర్ ఎ గుడ్ కాజ్' ఉద్దేశ్యంతో ఏర్పడిన యూనివన్ ఫౌండేషన్, భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారితో పోరాడడానికి, ఈ రోజు రూ. 2.50 లక్షల(అక్షరాలా రెండు లక్షల యాభై వేల రూపాయలు)ను పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. 
 
నిరుపేదలు మరియు అవసరం ఉన్నవారి అభ్యున్నతికి సంబంధించిన సామాజిక కార్యకలాపాలను నిర్వహించడంలో యూనివన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంది. "ఈ కరోనా మహమ్మారి విపత్తును ఎదుర్కొనడానికి సహాయపడటంలో ఇది మావంతు కృషి" అని యూనివన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, శ్రీమతి సత్యవతి రాయ్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎలా తయారు చేస్తారు?