Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎలా తయారు చేస్తారు?

హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎలా తయారు చేస్తారు?
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (14:24 IST)
ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, ప్రపంచ దేశాలన్నీ హైడ్రాక్సీక్లోరోక్వీన్ మందు జపం చేస్తున్నాయి. ఈ మందును భారీ మొత్తంలో దిగుమతి చేసుకునేందుకు అగ్రదేశాలు సైతం పోటీపడుతున్నాయి. ఇలాంటి దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల చూపంతా భారత్‌పై కేంద్రీకృతమైవుంది. దీనికి కారణం.. ఈ ఔషధాన్ని భారీ మొత్తంలో భారత్ ఉత్పత్తి చేయడమే. అలాంటి హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూఎస్) మాత్రలను ఏవిధంగా తయారు చేస్తారన్న అంశాన్ని తెలుసుకుందాం. 
 
సౌత్ అమెరికాలో మలేరియా జ్వరానికి విరుగుడుగా సిన్‌చోనా అనే చెట్టు బెరడును వాడుతారు. ఈ చెట్టు బెరడు నుంచి తయారు చేసిందే క్వినైన్. 1930ల నాటికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మలేరియా వచ్చింది. దీంతో ఈ క్వినైన్‌ను కృత్రిమంగా రసాయన పదార్థాలతో తయారుచేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. అపుడు క్లోరోక్విన్ అనే మాత్రలను తయారు చేశారు. 
 
అయితే ఈ మందు వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో 1950లలో క్లోరోక్విన్‌ను మరింత శుద్ధి చేసి దాని తయారీ విధానంలో మార్పులు చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఈ మందును మలేరియా, కీళ్లనొప్పులు, లూపస్‌ (ఎస్‌ఎల్‌ఈ) వంటి వ్యాధులకు వినియోగిస్తారు. 
 
ఈ మందు మన శరీరంలో ప్రవేశించిన వెంటనే మలేరియా పరాన్నజీవి కలిగించే వాపును నివారిస్తుంది. అది ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు ఈ మందులనే వాడతారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా జ్వరాలు పెద్దగా రావుగనుక ఆ దేశాల్లో ఈ మందుల నిల్వలు తక్కువ మోతాదులోనే ఉంటాయి. భారత్‌లో ఈ జ్వరాలు సర్వసాధారణంగా వస్తుండటంతో ఈ మందు నిల్వలు ఇతర దేశాలతో పోల్చితే పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారత్‌పై కేంద్రీకృతమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌కు అంత సత్తావుందా? మనదేశానికి ఎన్ని మాత్రలు కావాలి? కావాలి?