యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేయాలంటూ యోగి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నోఏళ్ల పాటు వివాదాస్పద స్థలంగా ఉన్న అయోధ్య భూభాగం..శ్రీరాముడు జన్మభూమి అని హిందువులకు చెందుతుంది అంటూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈసారి అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అనుకుంటున్న తరుణంలో... కరోనా వైరస్ ప్రభావం వల్ల శ్రీ రామనవమి వేడుకలను రద్దు చేసింది యూపీ సర్కార్.
ఈ వేడుకలకు ప్రజలు ఎవరిని అనుమతించ వద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో... ప్రజలు గుమికూడి కుండా చేసేందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కానీ యోగి సర్కారు.. శ్రీరామనవమి వేడుకలను రద్దు చేయడం హిందువులకు నిరాశను మిగిల్చింది. కొన్ని దశాబ్దాల కాలం నుండి వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూమిని రామజన్మభూమి ట్రస్టుకు చెందుతుందని సుప్రీం తీర్పు నేపథ్యంలో.. శ్రీరామ నవమి వేడుకలు రద్దు కావడం నిరాశనే మిగిల్చింది.