Webdunia - Bharat's app for daily news and videos

Install App

29-03-2022 మంగళవారం రాశిఫలాలు - నవగ్రహ శ్లోకాలను చదివిన శుభం

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (04:00 IST)
మేషం :- రాజకీయాలలో వారికి గుర్తింపుతో పాటు చికాకులు తప్పవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. ఏ సమస్యనైనా నిబ్బరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాలలో ఆసక్తి అధికమవుతుంది.
 
వృషభం :- ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవలన మంచి గుర్తింపు లభిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు పోటీని ఎదుర్కొనవలసివస్తుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవర పెడతాయి.
 
మిథునం :- మీ అవసరాలు, బలహీనతలు గమనించి ఇతరులు మిమ్ములను మోసగించేందుకు యత్నిస్తారు. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి.
 
కర్కాటకం :- బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ వహించండి. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. ఉపాధ్యాయులకు బాధ్యతలతో పాటు, పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల చికాకులు తప్పవు. హోటల్, తినుబండారాలు, చిరువ్యాపారులకు కలిసి రాగలదు.
 
సింహం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. కొబ్బరి, పండు, పూలు, కూరగాలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. ధనం బాగా అందుట వలన ఏ కొంతైనా నిల్వచేయ గలుగుతారు.
 
కన్య :- భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా ముగుస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
తుల :- కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చిన్న తప్పిదమైనా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి దూరమవుతారు. 
 
వృశ్చికం :-ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆప్తులతో పుణ్యక్షేత్ర సందర్శనాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. దూరప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. రాజకీయాలలో వారికి గణణీయమైన పురోభివృద్ధి కానవస్తుంది.
 
ధనస్సు :- సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులు ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి.
 
మకరం :- స్త్రీలు ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు హోదా పెరిగే సూచనలున్నాయి. మీ పెద్దల ఆరోగ్యలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. మీ అభిప్రాయం చెప్పటానికి సందర్భం వస్తుంది.
 
కుంభం :- వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నిస్తుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది.
 
మీనం :- కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. బంధుమిత్రులలో మీకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు.. రాష్ట్ర విద్యార్థులకు పంపిణీ

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

Jagan Birthday: జగన్‌కు నాగబాబు, చంద్రబాబుల పుట్టినరోజు శుభాకాంక్షలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

అన్నీ చూడండి

లేటెస్ట్

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments