Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-03-2022 సోమవారం రాశిఫలాలు - లిలత సహాస్రనామం చదివినా...

Advertiesment
28-03-2022 సోమవారం రాశిఫలాలు - లిలత సహాస్రనామం చదివినా...
, సోమవారం, 28 మార్చి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి వుండజాలదు. మీ మేథస్సుకి, వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సంకటంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు యోగప్రదం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహరాలు, భూ వివాదాలు ఒక కొలిక్కివస్తాయి. మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
మిథునం :- కాంట్రాక్టరుల, బిల్డర్లు కొత్త పనులు చేపడతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేక పోవడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయలో సంతృప్తి కానరాగలదు.
 
కర్కాటకం :- బంధువులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. పెద్దల ఆర్యోగ, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. రాజకీయ, కళా రంగాలకు చెందినవారు లక్ష్యాలు సాధిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభించినా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు.
 
సింహం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిచండి. విదేశీయాన యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికమవుతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
తుల :- స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. మీరు తొందరపడి సంభాషించడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తగలవు. మనుషుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కుటుంబీకుల సంతోషం కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
ధనస్సు :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. తల, పొట్టకి సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఒక అవకాశం కలిసివస్తుంది.
 
మకరం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోవారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి.
 
కుంభం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహరాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి.
 
మీనం :- ఎల్.ఐ.సి పాలసి, బ్యాంకు డిపాజిట్ల ధనం చేతికందుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాల నిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు నెమ్మదిగా పరోభివృద్ధి కానరాగలదు. దూర ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు తప్పుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-03-2022 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన శుభం..