Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-03-2022 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

Advertiesment
Daily Horoscope
, శనివారం, 26 మార్చి 2022 (04:00 IST)
మేషం:- మిమ్ములను తక్కువగా అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం మంచిది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు.
 
వృషభం :- కుటుంబీకుల మధ్య ఒక శుభకార్య విషయం ప్రస్తావనకు వస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. నిశ్చితార్థం, గ్రహ ప్రవేశాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. బాగా శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు.
 
మిథునం :- వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. మీ విషయాల్లో ఇతరుల జోక్యం ఇబ్బంది కలిగిస్తుంది. పాత మిత్రుల కలయికతో మీలో మార్పు వస్తుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
కర్కాటకం :- విద్యార్థులు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
సింహం :- స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన వాయిదా వేయటం మంచిది. అనుకున్నపనులు ప్రణాళికా బద్ధంగా పూర్తి కాగలవు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. రావలసిన ఆదాయంలో కొంత మొత్తమైనా అందుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించి సత్ఫలితాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
 
తుల :- అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. మీ సంతానం కోసం కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- పత్రికా రంగంలోని వారి ప్రతిభకు మంచి గుర్తింపులభిస్తుంది. బంధుమిత్రుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దుబారా నివారించాలన్న మీ యత్నం నెరవేరదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
ధనస్సు :- స్త్రీలతో మితంగా సంభాషించడం మంచిది. మీ ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టటం మంచిది. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి.
 
మకరం :- ఇంజనీరింగ్ విభాగం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. తీర్థయాత్రలు, విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఏకాగ్రత అవసరం. ఎదుటివారి విషయాలు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం :- పోస్టల్, ఎస్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. సోదరుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం, తరచూ విందులు వంటి శుభపరిణామాలుంటాయి. చేపట్టిన పనుల హడావుడిగా పూర్తి చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-03-2022 శుక్రవారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...