Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

రామన్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, చాకచక్యంగా అడుగులేస్తారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. అయన వారితో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. దూరప్రయాణం తలపెడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు పురమాయించవద్దు. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు సామాన్యం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికే చికాకుపడతారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కీలక పత్రాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఒక సమాచారం మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ నిజాయితీ ఆకట్టుకుంటుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా వ్యవహరించండి. ఒత్తిళ్లకు గురికావద్దు. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చచ చేపట్టిన పనులు సాగవు. పెద్దల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుటకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

తర్వాతి కథనం
Show comments